Breaking News

బాయ్‌ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్‌ ఐనా ఉండాలి

Published on Thu, 09/18/2025 - 14:29

చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్‌ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్‌ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ. 

అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్‌ నటి అమీషా పటేల్‌ కూడా చేరింది. కహోనా ప్యార్‌ హై సినిమాలో హృతిక్‌ రోషన్‌ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది.  పవన్‌ కళ్యాణ్‌ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. 

ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు  దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్‌,  ఉత్కర్ష్‌ శర్మతో కలిసి గదర్‌ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత  ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ  తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి అమీషా ఇంతవరకూ  ప్రకటించలేదు.

ఎన్ని హిట్‌ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్‌ డమ్‌ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్‌ హీరోయిన్‌ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.

తన  మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి  చెందిన వారై ఉండాలంది.  ‘ నేను  శిబిరాలకు చెందినదానిని  కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు  తాగను, సిగిరెట్‌ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది.  

తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని  అంది. ‘కహో నా... ప్యార్‌ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్‌ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్‌ రోషన్‌ కు కరీనా కపూర్‌తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది.  

పరిశ్రమ లో  సన్నిహితుడో, భాగస్వామి  లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె.  ‘సినిమా పరిశ్రమకు చెందిన  ఓ  బాయ్‌ఫ్రెండ్‌ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్‌  ఫుల్‌ కపుల్‌గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్‌.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)