Breaking News

సమంత 'సిటాడెల్‌ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్‌

Published on Thu, 04/17/2025 - 09:59

ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత (Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్‌ తర్వాత యాక్షన్‌, ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేసింది. 25 ఏళ్ల కెరీర్‌లో ఆమె ఎక్కువ కష్టపడ్డది సిటాడెల్‌ కోసమే! ఓపక్క మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడే సిటాడెల్‌లో యాక్షన్‌ సిరీస్‌ పూర్తి చేసింది.

ఇండియన్‌ సిటాడెల్‌ :హనీ బన్నీలో వరుణ్‌ ధావన్‌- సమంత

హాలీవుడ్‌ సిరీస్‌కు ఇండియన్‌ వర్షన్‌
నిజానికి ఇది ఒరిజినల్‌ కాదు. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌ 'సిటాడెల్‌' (Citadel)కు ఇది ఇండియన్‌ వర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్‌ వర్షన్‌లో హాలీవుడ్‌ స్టార్‌ రిచర్డ్‌ మాడెన్‌, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్‌ థామస్‌- జెస్సికా ద్వయం రూపొందించారు. దీని ఇండియన్‌ వర్షన్‌ సిటాడెల్‌: హనీ బన్నీ (Citadel: Honey Bunny)లో వరుణ్‌ ధావన్‌, సమంత లీడ్స్‌ రోల్‌లో నటించగా రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ఇది గతేడాది నవంబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజైంది.

హాలీవుడ్‌ సిటాడెల్‌లో రిచర్డ్‌ మాడెన్‌- ప్రియాంక చోప్రా

ఇకపై లేనట్లే
తాజాగా దీనికి సీక్వెల్‌ నిలిపివేస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌తో పాటు ఇటాలియన్‌ వర్షన్‌ (సిటాడెల్‌: డయానా) సీక్వెల్స్‌ ఆపేసి, బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీని గురించి అమెజాన్‌ ప్రైమ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. సిటాడెల్‌: హనీ బన్నీ, సిటాడెల్‌: డయానా సిరీస్‌లను కొనసాగించడం లేదు. దానికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేసి సిటాడెల్‌ సెకండ్‌ సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.

చదవండి: ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా?

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?