Breaking News

పొరపాటున శిరీష్‌కు కాబోయే సతీమణి ఫోటో షేర్‌ చేసిన 'అల్లు స్నేహ'

Published on Tue, 10/21/2025 - 13:39

నటుడు అల్లు శిరీష్‌(Allu Sirish) కొద్దిరోజుల క్రితం తన వివాహం గురించి ఒక పోస్ట్‌ చేశారు. అక్టోబర్‌ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు చెప్పారు. అయితే, తను ఫోటోను మాత్రం ఆయన రివీల్‌ చేయలేదు. కానీ, దీపావళీ పండుగ సందర్భంగా అల్లు కుటుంబం మొత్తం ఒకచోట చేరి ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలో శిరీష్‌ వదిన అల్లు స్నేహ ఫ్యామిలీ ఫోటోలను సోషల్‌మీడియాలో పంచకున్నారు. పొరపాటున నయనిక ఫోటోను కూడా ఆమె షేర్‌ చేశారు. తర్వాత అసలు విషయం గుర్తించిన ఆమె ఆ ఫోటోను కాస్త సైడ్‌ చేసి ఉంచారు. ఇంతలో నెటిజన్లు డౌన్‌లోడ్‌ చేసి శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

నయనిక అల్లు కుటుంబంతో దీపావళి వేడుకలో మొదటిసారి కనిపించారు. ఆ ఫోటోలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, స్నేహ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు. నయనిక తన కాబోయే భర్త పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటోలను వారు వెంటనే తొలగించినప్పటికీ, నెటిజన్లు వాటిని  వైరల్ చేశారు. అయితే, అల్లు కుటుంబం ఆమెను అధికారికంగా ఎప్పుడు పరిచయం చేస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నయనికతో శిరీష్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారు పెళ్లి పీటలెక్కుతున్నారు. అక్టోబర్‌ 31న నిశ్చితార్థం జరగనుంది. డిసెంబరులో విదేశాల్లో వివాహ వేడుక జరగనుందని సమాచారం.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)