Breaking News

పెళ్లికి ముందే పిల్లల విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నాం: అల్లు శిరీష్‌

Published on Fri, 03/13/2026 - 14:44

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.

అత్తయ్యకు దొరికిపోయాం..
మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్‌ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.

నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు ఇష్టం
నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు చాలా ఇష్టం.  ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్‌ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని

లీటర్ పెట్రోల్ Rs.115 ఖాళీ ఖాళీగా పెట్రోల్ బంకులు

బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు

ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు

థాంక్యూ రేవంతన్న.... బన్నీ ఎమోషనల్

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం

పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి

Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి

పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం

Photos

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)