Breaking News

నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా..: అల్లు శిరీష్‌

Published on Wed, 03/11/2026 - 22:36

టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉన్నాడు.

విలువైన సలహా
తాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్‌ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. 

ఇవే జీవితంలో మధుర క్షణాలు
కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్‌లో కరెక్ట్‌ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.

లవ్‌స్టోరీ
తన లవ్‌స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్‌ వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్‌ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్‌. 

సీరియస్‌ కాదేమోనని అనుమానం
నావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్‌ను, నేను సీరియస్‌గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్‌ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్‌లో డేటింగ్‌ మొదలుపెట్టాం అని శిరీష్‌ చెప్పుకొచ్చాడు.

 

 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)