Breaking News

అల్లు అర్జున్‌ కొత్త సినిమా ప్రకటనలో సడెన్‌గా కీలక మార్పులు..?

Published on Tue, 02/11/2025 - 07:35

పుష్ప2 విజయంతో అల్లు అర్జున్ ఇమేజ్‌ భారీగా పెరిగింది.  ఈ సినిమా తర్వాత బన్నీ  హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి..? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో సడెన్‌గా బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

పుష్ప2 సమయంలోనే అల్లు అర్జున్‌కు  అట్లీ కథ చెప్పాడట. అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేశాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాశారని తెలిసింది. ఆ సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేసేందుకు అట్లీ డీల్‌ సెట్‌ చేసుకున్నాడు.. ఆ ప్రాజెక్ట్‌ కూడా క్యాన్సిల్‌ కావడంతో అట్లీ టీమ్‌ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్‌ను మరోసారి కలిసినట్లు టాక్‌ వస్తుంది. దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అట్లీతో చేసే చిత్రం దాదాపు యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని నెట్టింట వైరల్‌ అవుతుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్‌ కోసం త్రివిక్రమ్‌ భారీ కాన్వాస్‌ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్‌. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. సోషల్‌ మైథలాజికల్‌ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్‌ కథని సిద్ధం చేస్తున్నారని టాక్‌. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నెలలోనే బన్నీ కొత్త సినిమా ప్రకటనపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

అట్లీతో సినిమా కోసం సాయి అభ్యంకర్ అనే కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వాలని ప్లాన్‌లో ఉన్నారట. స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి అభ్యంకర్.. తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దర్శకుడు ఆర్జే బాలాజీ- సూర్య సినిమాకు అభయ్‌నే సంగీత దర్శకుడు కావడం విశేషం. హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఆయన చేసిన ఒక సాంగ్‌ మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. లోకేశ్ కనగరాజ్ స్టోరీతో వస్తున్న బెంజ్‌ సినిమాకు ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ మూవీలో ఛాన్స్‌ దక్కితే మరో కొత్త సంగీత దర్శకుడి పేరు సెన్సేషనల్‌ కానుంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)