Breaking News

అమ్మ బర్త్‌ డే.. ఐకాన్ స్టార్‌ స్పెషల్ పోస్ట్!

Published on Sat, 06/21/2025 - 16:43

గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు.  హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు.

అవార్డుల అల్లు అర్జున్‌..

పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్‌' ఉత్తమ నటుడిగా 'గద్దర్‌' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్‌ తొలి అవార్డ్‌ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్‌ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా..  బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా  11సార్లు నామినేట్‌ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్‌ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాడు.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)