Breaking News

పెద్ది సినిమాపై అల్లు అర్జున్‌ రివ్యూ

Published on Tue, 06/09/2026 - 11:26

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 292.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం ఈ సినిమాపై నిన్నటి వరకు స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్‌ పెద్ది సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు.  నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

‘నిన్న రాత్రి పెద్ది సినిమా చూశా. రామ్‌ చరణ్‌ నటన మైండ్‌ బ్లోయింగ్‌. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణించాడు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్‌ నిజమైన అర్హుడు. జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. జాన్వీ కపూర్‌కి ప్రేమపూర్వక అభినందనలు. టెన్నికల్‌ టీమ్‌కు, నిర్మాతలకు నా అభినందనలు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్‌ జోడీగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)