Breaking News

బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. ఆ ఒక్కటి వచ్చుంటే?

Published on Thu, 01/02/2025 - 19:39

బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో  రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

హిందీలో రికార్డ్ స్థాయి వసూళ్లు..

సుకుమార్‌- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.770 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్‌ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్‌లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగానూ ఘనతను సొంతం చేసుకుంది. ‍

ఓవర్‍సీస్‌లోనూ హవా..

ఓవర్‌సీస్‌లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్‌ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.

కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్‌ బ్రేక్..

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)