Breaking News

'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!

Published on Fri, 01/31/2025 - 19:22

సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్‌ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్‌లో మొదటిస్థానంలో ఉంది.

అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్‌ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

అయితే క్లైమాక్స్‌ సీన్‌పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్‌ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్‌ సీన్‌తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్‌ ఈ ఫైట్ సీన్‌ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.

కాటేరమ్మ > రప్పా రప్పా

పుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్‌ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని  ఓ నెటిజన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్‌ సీన్‌ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్‌గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్‌ కంటే కాటేరమ్మ సీక్వెన్స్‌కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్‌ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే  కాటేరమ్మ సీన్‌ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)