Breaking News

అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?

Published on Wed, 04/09/2025 - 07:12

అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా ప్రకటించాడు. తమిళ దర్శకుడు అట్లీతో (Director Atlee) కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇదంతా అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ అతడెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

యూట్యూబ్ లో గతేడాది వైరల్ ‍అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'కచ్చి సేరా', 'ఆశా కూడా' పాటలు ఉంటాయి. ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. వీటిని పాడి, ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్(Sai Abhyankkar).

అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే సాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. అనిరుధ్ దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పనిచేశాడు. గతేడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు మరో రెండు-మూడు ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)

మిగతా సినిమాల సంగతేమో గానీ అల్లు అర్జున్-అట‍్లీ సినిమా కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందనమాట. అనౌన్స్ మెంట్ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతుంది. 

ప్రస్తుతానికి ఇతడు బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు ‍అధికారికంగా చెప్పలేదు. త్వరలో మంచిరోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి. ఇకపోతే సాయి అభయంకర్ కి ట్విన్ సిస్టర్ ఉంది. ఆమె పేరు సాయిస్మృతి. ఈమె కూడా సింగరే.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)