Breaking News

Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్‌: అల్లు అర్జున్

Published on Fri, 03/13/2026 - 05:00

హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్‌ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.

అల్లు అరవింద్‌ను టెక్నాలజీ పయనీర్‌గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్‌ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.

అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్‌ను హైదరాబాద్‌కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)