Breaking News

అల్లు అర్జున్‌ కజిన్‌ హీరోగా ముఖ్య గమనిక! సాంగ్‌ విన్నారా?

Published on Tue, 12/26/2023 - 13:29

హీరో అల్లు అర్జున్‌ కజిన్‌ విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇందులో లావణ్య హీరోయిన్‌. సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించారు. కిరణ్‌ వెన్న సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఆ కన్నుల చూపుల్లోన..’ అంటూ సాగే పాటని డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర (బాబీ) రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘బన్నీగారిని (అల్లు అర్జున్‌) ఎప్పుడు కలవడానికి వెళ్లినా విరాన్‌ కనిపించేవాడు.

అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ పెట్టుకుని వాళ్ల సహాయం తీసుకోకుండా వారి ఆశీస్సులు తీసుకుని సొంత గుర్తింపు కోసం స్వతంత్రంగా ప్రయత్నించడం సంతోషం’’ అన్నారు. ‘‘నేను పుట్టింది, పెరిగింది ఇండస్ట్రీలోనే. బాబీ అన్నలాంటి మంచి మనిషి ఇండస్ట్రీలో లేరు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు చేసిన సహకారం మర్చిపోను’’ అన్నారు విరాన్‌.

‘‘తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి.. ఆ ఆలోచనని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి.. ఆ నేపథ్యంలో తీసిన సినిమా ఇది’’ అన్నారు వేణు మురళీధర్‌. ‘‘మా బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం ‘ముఖ్య గమనిక’. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు రాజశేఖర్‌. కాగా విరాన్‌ ముత్తం శెట్టి గతంలో బతుకు బస్టాండ్‌ అనే సినిమా చేశాడు.

చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్‌- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)