Breaking News

అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్.. ఇంతకీ ఎవరితడు?

Published on Tue, 09/30/2025 - 13:36

'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ టచ్ చేసిన అల్లు అర్జున్.. పార్ట్ 2తో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నటివరకు బన్నీ డ్యాన్స్ అంటే టాలీవుడ్ లేదా బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ స్టెప్పులు కంపోజ్ చేసేవారు. ఇప్పుడు అట్లీతో మూవీ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్‌ని తీసుకొచ్చారు. ఇంతకీ ఇతడెవరు?

ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం స్టెప్పులు కంపోజ్ చేయబోతున్నాడు. గత నెల రోజుల నుంచి ఓ భారతీయ సినిమా కోసం పనిచేస్తున్నానని అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ విషయాలు చెప్పకూడదు అంటూ ఇన్ స్టాలో కొనిషి ఓ పోస్ట్ పెట్టాడు. బన్నీతో ఇతడు కలిసున్న ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...)

కొనిషి.. డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్. పుట్టింది జపాన్‌లో పెరిగిందంతా ఇంగ్లాండ్‌లో. విచిత్రమైన అవతారంలో కనిపించే ఇతడికి పలు దేశాల్లో అభిమానులున్నారు. 15 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ లాంటివి నేర్చుకోకముందే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. హిప్ హాప్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అమెరికన్ హిప్ హాప్ 'క్వెస్ట్ క్రూ'తో కలిసి పనిచేశాడు.

అయితే అమెరికన్ రియాలిటీ షో 'సో యూ థింగ్ యూ కెన్ డ్యాన్స్' 1,2,3 సీజన్లలో పాల్గొని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచినప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాడు. 2008లోనే ఎమ్మ అవార్డ్ కూడా అందుకోవడం విశేషం. ఇలాంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు బన్నీకి స్టెప్స్ కంపోజ్ చేస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఆ పాట ఏ రేంజులో ఉండబోతుందో?

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)