Breaking News

ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?

Published on Sun, 01/04/2026 - 21:22

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.

అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్‌నే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్‌తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.

ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)