దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్

Published on Mon, 11/24/2025 - 17:09

ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్‌కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?)

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)