Breaking News

'నా కెరీర్‌లో ఇలా చేయడం తొలిసారి'.. అల్లరి నరేశ్

Published on Tue, 11/11/2025 - 21:53

అల్లరి నరేశ్ నటించిన క్రైమ్  థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని  నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అల్లరి నరేశ్ మాట్లాడుతూ..'ఇప్పటివరకూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీస్‌ చేశా. మధ్యలో కొన్ని సీరియస్‌ పాత్రలు కూడా ప్రయత్నించా. నా కెరీర్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మల్టీ లేయర్‌ సబ్జెక్ట్‌. స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్‌తో చేశా. కాసరగడ్డ నానికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న నాని పెళ్లి గిఫ్ట్‌గా ఈ సినిమా సక్సెస్ అందిస్తాం. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్‌ రమేశ్‌ కేవలం 41 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్‌ చేశాం. ఈ సినిమాలో ఎవరు విలన్‌ అనేది చివరి వరకు కనిపెట్టలేరు'‌ అని అన్నారు. కాగా.. ఈ చిత్రం నవంబర్  21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)