Breaking News

'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!

Published on Tue, 05/13/2025 - 16:06

బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.

ఆలియా భట్ తన నోట్‌లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్‌ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే  ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్‌ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్‌పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్‌కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)