Breaking News

ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sat, 05/30/2026 - 14:20

ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్‌ ఎ‍క్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్‌లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్  ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్‌ను ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు.

'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్‌. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు.
 

 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)