Breaking News

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి

Published on Thu, 06/12/2025 - 16:09

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్‌కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు.  ఈ  కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.  ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని..  ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.

అహ్మదాబాద్  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే  ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. 

కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు.
 

 

 

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)