Breaking News

సినిమా హిట్.. కలెక్షన్స్ మాత్రం దారుణం

Published on Wed, 04/23/2025 - 15:35

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar).. ఏడాదికి కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటాడు. అలాంటిది ఇతడికి గత నాలుగేళ్లుగా సరైన హిట్ అన్నది లేకుండా పోయింది. 20కి పైగా చిత్రాల్లో నటిస్తే మధ్యలో ఒకటి కాస్త పర్వాలేదనిపించుకోగా.. ఇన్నాళ్లకు 'కేసరి 2'(Kesari 2) రూపంలో అద్భుతమైన హిట్ దక్కింది. కానీ వసూళ్లే దారుణంగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)

చిన్నాచితకా హీరోలైతే కాస్త నిదానంగా వసూళ్లు వస్తాయి. కానీ స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే మంచి నంబర్స్ నమోదు అవుతుంటాయి. కానీ అక్షయ్ కుమార్ 'కేసరి 2' పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రిలీజైన రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉత్తరాది సైట్లన్నీ 3కి పైగా రేటింగ్ కూడా ఇచ్చాయి. కానీ జనాలు ఎందుకో దీన్ని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు.

ఇప్పుడు దీనికి నిదర్శనం అన్నట్లు ఐదు రోజుల్లో రూ.39.16 కోట్ల నెట్ కలెక్షన్స్(Movie Collection) మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ చిత్రానికి ఓ రకంగా మైనస్ అని చెప్పొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనే ఆలోచనతో చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నట్లు అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

బహుశా ఇలాంటి కారణాల వల్లే సినిమా హిట్ ‍అయినా కలెక్షన్స్ మాత్రం రోజురోజుకీ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అక్షయ్ గత చిత్రాల ఫ్లాప్ ప్రభావం దీనిపై పడిందా అనే సందేహం కూడా వస్తోంది. 

ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రూ.100 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో?

(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు