Breaking News

శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్‌ను ఎలా ఒప్పుకున్నాడు?

Published on Fri, 06/20/2025 - 21:03

కోలీవుడ్ స్టార్‌ ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.

నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్‌లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్‌కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.

శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే.. ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్.

శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు దాదాపు చాలా నేచురల్‌గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్‌ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)