Breaking News

మూడేళ్ల తర్వాత హిట్.. అఖిల్ ఫుల్ ఎమోషనల్

Published on Fri, 07/10/2026 - 18:37

అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చిన చిత్రానికి హిట్ టాక్ రావడంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ కట్ చేస్తుండగా నాగార్జున కాళ్లకు నమస్కరించిన అఖిల్.. ఆయనతో గట్టిగా కౌగిలించుకుని ఎమోషనలయ్యారు. ఈ వీడియోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. 
 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)