ఈషా కథ విని షాక్‌ అయ్యాను: అఖిల్‌ రాజ్‌

Published on Wed, 12/24/2025 - 00:09

‘‘శ్రీనివాస్‌ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్‌ డిజైనింగ్‌ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్‌ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్‌ రాజ్‌ తెలిపారు. త్రిగుణ్, అఖిల్‌ రాజ్‌ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.

ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్‌ రాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్‌ సిరీస్‌ గ్లింప్స్‌ చూసి, దర్శకుడు శ్రీనివాస్‌గారు నన్ను ఆడిషన్  చేసి, ఈ చిత్రంలో వినయ్‌ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ విడుదలైంది. 

ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్‌ పాత్రను ‘ఈషా’లో చేశాను.  దామోదర ప్రసాద్‌ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్‌గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్‌ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)