Breaking News

ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?

Published on Mon, 05/26/2025 - 21:07

అక్కినేని హీరో అఖిల్.. హీరోగా ఐదు సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా.. అది రద్దయింది. దీంతో చాన్నాళ్ల పాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు.

జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్‌మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) 

ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్నిరోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో ఏడడుగులు వేసిన చైతూ.. నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఇతడు.. హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫొటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.

(ఇదీ చదవండి: విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)