Breaking News

అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్

Published on Wed, 07/08/2026 - 21:04

కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్ పండించగలిగితే చాలు. కొందరు  హీరోలకు ఈ ఇమేజ్ సంపాదించడానికి ఏళ్లు పడుతుంది. మరికొందరికి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సదరు ఇమేజ్ వచ్చేస్తుంది. ‍అలాంటి వాళ్లలో అక్కినేని అఖిల్ ఒకడు. తాత, తండ్రి, సోదరుడు హీరోలు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ. కానీ అఖిల్ సినీ జాతకంలో హిట్ అనే లోటు ఉండిపోయింది. మరి అఖిల్ 'లెనిన్'తో హిట్ కొడతాడా? అసలు ఈ మూవీ ఎందుకంత కీలకం?

(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)

2015లో హీరోగా పరిచయమైన అఖిల్.. అంతకు ముందు అంటే చిన్నప్పుడే 'సిసింద్రీ'లో నటించాడు. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే ఇండస్ట్రీకి వచ్చేశాడు. పెరిగి పెద్దయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో అతిథి పాత్రలో కనిపించాడు. కుర్రాడికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని అందరితో అనిపించుకున్నాడు. అలా 2015లో 'అఖిల్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ చూసి హిట్ లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ అలా అస్సలు జరగలేదు.

2015లో 'అఖిల్' వచ్చింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ ఇలా వరసగా మూవీస్ అయితే వచ్చాయి గానీ హిట్ హీరో అని మాత్రం అఖిల్ అనిపించుకోలేకపోయాడు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించుకున్నాయంతే. దీంతో హీరో అయ్యి పదకొండు సంవత్సరాలు గడిచినా అఖిల్ గురించి ఇప్పటికీ ఒకే మాట వినిపిస్తుంది. 'అతనిలో టాలెంట్ ఉంది కానీ దాన్ని నిరూపించే సినిమా మాత్రం ఇంకా రాలేదు' అని.

అయితే అసలు సమస్య అఖిల్ చేసే సినిమాల స్క్రిప్ట్‌లదా? ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడకపోవడమా? లేదంటే ప్రతి సినిమాతో కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ఐడెంటిటీని నిర్మించుకోలేకపోవడమా? అనేది అర్థం కాని ప్రశ్న. మరి ఈ శుక్రవారం(జూలై 09) విడుదలయ్యే 'లెనిన్'తో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా అనేది చూడాలి? ఎందుకంటే ఈ మూవీ సక్సెస్ అఖిల్‌కి చాలా అంటే చాలా ముఖ్యం.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)

చాలామంది హీరోలు కెరీర్ ప్రారంభంలో ఒకే తరహా ఇమేజ్‌ని ఏ‍ర్పరుచుకుంటారు. అఖిల్ మాత్రం ప్రతి సినిమాతో కొత్త రూపంలో కనిపించేందుకు ప్రయత్నించాడు. అవే మైనస్‌లు అయ్యాయా అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల జానర్లు ట్రై చేశాడు కానీ వాటి కథాకథనాలు బలహీనంగా ఉండేసరికి మూవీస్ ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ ఫ్లాప్ హీరోగా మిగిలిపోయాడు.

మూడేళ్ల క్రితం అంటే 2023లో విడుదలైన 'ఏజెంట్' కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్, పాన్ ఇండియా ఇమేజ్ టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం పూర్తిగా తేలిపోయింది. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, నటన.. దాదాపు ప్రతి అంశంపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన ఈ సినిమా చాలా కాలం పాటు ఓటీటీలోకి కూడా రాలేదు. దీంతో అఖిల్ కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని 'లెనిన్' చేశాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. యాక్షన్ ఉన్నప్పటికీ ట్విస్టులు, ఎమోషన్స్‌కి కూడా చోటిచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ప్రస్తుతానికైతే అన్ని ఎలిమెంట్స్ అఖిల్‌కి పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. ఇక హిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ 'లెనిన్' ప్రేక్షకులను మెప్పిస్తే, అది అఖిల్‌కు హిట్ ఇవ్వడమే కాదు. గత 11 ఏళ్లుగా వెతుకుతున్న ఒక స్పష్టమైన స్క్రీన్ ఐడెంటిటీని కూడా అందించగల సినిమా అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)