Breaking News

అఖిల్‌ అక్కినేని రిసెప్షన్‌.. ఈ విషయం గమనించారా?

Published on Mon, 06/09/2025 - 11:16

అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. గతేడాది చివర్లో నాగార్జున (Nagarjuna Akkineni) పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది. ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్‌ పెళ్లి.. జైనబ్‌తో జరిపించాడు. ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిళ్లు కావడం విశేషం. జూన్‌ 6న పెద్ద హడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్‌. కానీ రిసెప్షన్‌ మాత్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. 

రెండు రోజుల గ్యాప్‌తో రిసెప్షన్‌
జూన్‌ 8న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ జరిగింది. మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, నిఖిల్‌, సూర్య, యశ్‌, నాని, కిచ్చా సుదీప్‌, దిల్‌ రాజు, సుకుమార్‌, బుచ్చిబాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో మీరో విషయం గమనించారా? అఖిల్‌ (Akhil Akkineni) దాదాపు అన్ని ఫోటోల్లోనూ జైనబ్‌ చేయి పట్టుకునే కనిపించాడు. 

అఖిల్‌-జైనబ్‌ ఫ్యామిలీ ఫోటో

అన్ని ఫోటోల్లోనూ..
ఆమె చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. సినీతారలే కాదు, సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా భార్య చేతిని వదల్లేదు. అటు జైనబ్‌ కూడా అంతే..! ఇది చూసిన అభిమానులు ఈ కొత్త జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ చేయి వదలకూడదని చెప్తున్నారు. ఒక ఫోటోలో అయితే అఖిల్‌ అటు అత్త చేతిని, ఇటు భార్య చేతిని పట్టుకుని ఆనందంగా కనిపించాడు. డ్రెస్సింగ్‌ విషయానికి వస్తే కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల జోలికి వెళ్లకుండా పెళ్లికి తెలుపు, రిసెప్షన్‌కు గోధుమ రంగు దుస్తులు ధరించారు. 

ఎవరీ జైనబ్‌?
ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్‌. ఈమె సోదరుడు జైన్‌ రవ్జీ.. జెడ్‌ఆర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చైర్మన్‌గా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. జైనబ్‌.. పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌. అఖిల్‌ వయసు 31 ఏళ్లు కాగా ఈమె వయసు 39 ఏళ్లని తెలుస్తోంది.

 

 

చదవండి: ఓటీటీలో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్‌

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు