Breaking News

'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్‌'

Published on Tue, 01/06/2026 - 13:19

బాలకృష్ణ- బోయపాటి శ్రీను సినిమా 'అఖండ2: తాండవం'.. డిసెంబర్‌ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు యాప్‌లో పేర్కొంది. అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో కూడా పోస్టర్‌తో పేర్కొంది. దీంతో ఈ పండుగనాడు సినిమాను మరోసారి చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్‌ అనుకున్నారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ట్విస్ట్‌ ఇచ్చింది.

'అఖండ2: తాండవం' నెట్‌ఫ్లిక్స్‌లో  జనవరి 9న స్ట్రీమింగ్‌కు వస్తుందని యాప్‌లో ప్రకటించారు.  ఈ క్రమంలోనే  సినిమా పోస్టర్‌ను కూడా ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (యాప్) అప్‌కమింగ్‌ చిత్రాల విభాగంలో కనిపించింది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. మూవీ లింక్‌ను కూడా తప్పించారు. అయితే, సోషల్‌మీడియాలో మాత్రం ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్‌ వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని వివరాలు తెలిపే ఛాన్స్‌ ఉంది.

'అఖండ 2' నిర్మాతలకు భారీనష్టాలే తెచ్చిపెట్టిందని బాక్సాఫీస్‌ లెక్కలు తెలుపుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌ను  14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్‌ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్‌ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు