Breaking News

నా సినిమా ఉగాది పచ్చడిలాంటిది: బాలకృష్ణ

Published on Sat, 11/29/2025 - 00:47

‘‘నేను పాదరసంలాంటివాణ్ణి.. ఏ పాత్రలో అయినా ఒదిగి పోతా. నా సినిమా ఉగాది పచ్చడిలాంటిది.. అన్ని రుచులు ఉంటాయి. డిసెంబరు 5న థియేటర్లలో అఖండ తాండవం చూస్తారు’’ అని బాలకృష్ణ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ, సంయుక్త జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను, బోయపాటి సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం.. నాలుగో నిమిషం ఆ మహాయజ్ఞంలోకి దిగి పోతాం. రామ్, గోపీగార్లు కానీ, నేను కానీ విజయాలకు  పొంగి పోం.. అపజయాలకు కృంగి పోం.. నా అభిమానులూ అంతే. మన సినిమా విడుదల సందర్భంగా జీవహింస చేయొద్దని నా అభిమానులను కోరుతున్నా. వాటికి కూడా జీవించే హక్కు ఉంది’’ అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ ఒక్కరిది కాదు.. అందరిది. ఇక్కడ కుల, మత, భేదాలు లేవు. ప్రజలకు మంచి చెప్పాలి, వినోదం పంచాలన్నది మాత్రమే ఉంటుంది. మన ‘అఖండ 2’ సక్సెస్‌ కొట్టాలి. ‘ది రాజా సాబ్‌’ కూడా విజయం సాధించాలి. ఆ తర్వాత వచ్చే చిరంజీవిగారి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కూడా హిట్‌ కావాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి. అప్పుడే అందరూ బాగుంటారు’’ అని తెలిపారు. 

గోపి ఆచంట మాట్లాడుతూ– ‘‘బోయపాటి, బాలకృష్ణగారి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాల కంటే ‘అఖండ 2’ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు. తమన్‌ మాట్లాడుతూ– ‘‘రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనీల్‌ సుంకరగార్లతో ‘దూకుడు, ఆగడు’ వంటి సినిమాలు చేశాను. ఆ చిత్రాల తర్వాత  ‘అఖండ 2’ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)