Breaking News

అఖండ-2పై నెగెటివిటీ నిజమే: రామ్‌ ఆచంట

Published on Fri, 12/12/2025 - 18:14

వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌కుమార్‌ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్‌ అయ్యారు.

అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్‌ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్‌లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్‌ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ వేరుగా ఉందన్నారు. 

రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్‌ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్‌ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్‌డ్‌  రిపోర్ట్ ఉందని  రామ్‌ ఆచంట తెలిపారు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)