Breaking News

అఖండ 2: శివుడి పాత్ర చేసిందెవరో తెలుసా?

Published on Sat, 12/13/2025 - 12:44

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2: తాండవం. ఇది 2021లో వచ్చిన హిట్‌ సినిమా అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దైవభక్తిపై ఆధారపడి తీసిన ఈ మూవీ డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాకపోతే సినిమాలో కొన్ని సీన్లు లాజిక్‌తో సంబంధం లేకుండా మరీ ఓవర్‌గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అఖండ 2లో శివుడు
అయినా బాలయ్య డైలాగులు, యాక్షన్‌ 'అతి' లేకుండా ఉండవని అందరికీ తెలిసిందే! అయితే సినిమాలో శివుడి పాత్ర మాత్రం బాగుందంటున్నారు. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో భక్తిభావంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ముఖ్యమైన సీన్‌లో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీస్తున్నారు.

హిందీ సీరియల్స్‌లో ఫేమస్‌
అతడు మరెవరో కాదు హిందదీ బుల్లితెర నటుడు తరుణ్‌ ఖన్నా. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్‌లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ, రామ్‌ సియాకె లవ్‌కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్‌ రామాయణ్‌, వీర్‌ హనుమాన్‌: బోలో బజ్‌రంగ్‌ బలీకీ జై, కాల భైరవ్‌ రక్ష శక్తిపీఠ్‌ కే వంటి పలు సీరియల్స్‌లో ఈశ్వరుడిగా వేషం కట్టి మెప్పించాడు.

పర్ఫెక్ట్‌!
అందుకే ఈ పాత్రకు తనైతే పర్ఫెక్ట్‌గా సూట్‌ అవుతాడని భావించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అంచనా నిజమైంది. తరుణ్‌ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సీన్‌ వెండితెరపై బాగా పేలిందని టాక్‌ వినిపిస్తోంది. తరుణ్‌ ఖన్నా (Tarun Khanna).. చంద్రగుప్త మౌర్య సీరియల్‌లో చాణక్య పాత్ర పోషించాడు.

చదవండి: 25 ఏళ్లుగా డిన్నర్‌కే వెళ్లలేదంటున్న బాలీవుడ్‌ స్టార్‌

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు