Breaking News

'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?

Published on Sun, 12/14/2025 - 15:16

రీసెంట్‌గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్‌డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్‌లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది.  దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.

మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్‌కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్‌గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్‪‌కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)