బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
ఉత్కంఠను పెంచుతున్న అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం3’ ట్రైలర్
Published on Wed, 09/09/2026 - 16:38
మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు ‘దృశ్యం 3’ రాబోతోంది. మలయాళంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో విడుదలైన ‘దృశ్యం3’ ఈ సారి హిందీలోనూ విడుదలకానుంది. ఈమేరకు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, కీలక పాత్రలో అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం3’ని తెరకెక్కించారు. టబు,ప్రకాశ్ రాజ్, శ్రియతో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈ చిత్రం గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం3’కి పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌ను ముగించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకే దృశ్యం: ది కన్‌క్లూజన్ అనే టైటిల్‌తో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాలు, ట్విస్టులు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
Tags : 1