Breaking News

ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్‌ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?

Published on Sun, 06/08/2025 - 08:27

టైటిల్: సొప్పన సుందరి
నటీనటులు:  ఐశ్వర్య రాజేశ్‌, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్‌, కరుణాకరన్‌ తదితరులు
డైరెక్టర్:  ఎస్‌జీ ఛార్లెస్‌
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: జియో హాట్‌స్టార్

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

'సొప్పన సుందరి' కథేంటంటే..
అహల్య (ఐశ్వర్య రాజేశ్‌) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
వీకెండ్‌ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. ‍అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా  ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్‌) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

పోలీసుల చేతికి కారు వెళ్లడంతో..  సెకండాఫ్‌ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్‌తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్‌ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్‌లెస్‌గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్‌ అవుతుంది. అందుకే డైరెక్టర్‌ ఎలాంటి లాజిక్‌ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్‌ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్‌కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు.  కక్లైమాక్స్‌లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్‌లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.

ఎవరెలా చేశారంటే..
ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ‌తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్‌, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్‌ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)