Breaking News

కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు

Published on Sun, 05/31/2026 - 08:32

నటి ఐశ్వర్యరాజేశ్‌ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్‌, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలును అందుకున్నారు. అక్కడ వెంకటేష్‌ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. 

అలా తెలుగులో చిత్రాలు చేయడంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్‌ వచ్చింది. కాగా ఇప్పుడు ఇక్కడ మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్‌–18 అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్రిమారన్‌ శిష్యుడు కార్తీక్‌ పెరుమాళ్‌స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్‌న్స్‌ పతాకంపై బి.జగదీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసినందుకు దక్కిన అవకాశం ఈ చిత్రం అని ఐశ్వర్య రాజేశ్‌ అన్నారు.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)