Breaking News

బిగ్‌బాస్‌ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!

Published on Fri, 07/04/2025 - 16:39

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్‌బాస్‌ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్‌బాస్‌ టీమ్‌ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో AI రోబో
సింగర్‌, డ్యాన్సర్‌, మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, యాంకర్‌, యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్‌కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్‌ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్‌లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్‌బాస్‌ హౌస్‌కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌ కోసం ఈ రకంగా ప్లాన్‌ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్‌లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.

రోబో విశేషాలు
యూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్‌ కలర్‌ మాస్క్‌తో లెహంగాలో క్యూట్‌గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెడితే గేమ్‌ ఛేంజర్‌గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!

చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)