Breaking News

గతేడాది మూడు ఫ్లాపులు.. అయినా తమన్నాకు బంపరాఫర్‌!

Published on Thu, 02/16/2023 - 08:45

ఊహించని మంచి సంఘటనలు జరిగినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు హీరోయిన్‌ తమన్నా అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. అతి తక్కువ మంది మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లలో ఈ మిల్కీబ్యూటీ ఒకరు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న తమన్నా త్వరలో పెళ్లి ముచ్చట్లు చెప్పడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వయా టాలీవుడ్‌ అంటూ నట ప్రయాణాన్ని సాగిస్తున్న ఈ బ్యూటీ నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. గత ఏడాది తమన్నా నటించిన నాలుగు చిత్రాల్లో మూడు నిరాశ పరిచినా, ఈమెపై ఆ ఎఫెక్ట్‌ పడకపోవడం విశేషం.

ప్రస్తుతం భాషకో చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అందులో రెండు చిత్రాలు సూపర్‌స్టార్స్‌తో నటించడం. అవును తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‌. తమిళంలో రజనీకాంత్‌కు జంటగా జైలర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్న విషయం. చిరంజీవితో ఇంతకు ముందే సైరా చిత్రంలో నటించారు. దీంతో భోళాశంకర్‌ చిత్రంలో రెండో సారి నటిస్తున్నారు కాబట్టి పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.  కానీ రజనీకాంత్‌తో తొలిసారిగా నటించే అవకాశం రావడంతో ఆనంద సాగరంలో తేలిపోతున్నారు.

దీని గురించి తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ రజనీకాంత్‌ సరసన నటిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనలాంటి ఎందరో నటీమణులు రజనీకాంత్‌కు జంటగా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా జైలర్‌ చిత్రంలో ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు లభించిందన్నారు. షూటింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి నటించే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తలచుకుంటుంటేనే చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే రెండోసారి చిరంజీవితో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. వీటితో పాటు హిందీలో బోల్‌ చుడియా, మలయాళంలో పాందిరా చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా తమన్నాకు కలిసొస్తుందేమో చూడాలి.

చదవండి: ఎన్టీఆర్‌ సినిమాతో జాన్వీకపూర్‌ ఎంట్రీ!

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)