చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్
Breaking News
డెకాయిట్ 1st డే కలెక్షన్స్: శేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్..
Published on Sat, 04/11/2026 - 11:25
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రేమకథ, యాక్షన్ మేళవించి ఉన్న చిత్రాన్ని షానియల్ డియో డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఫస్ట్ డే కలెక్షన్స్
భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అడివి శేష్ కెరీర్లో ఇదే మొదటిసారి! మరి మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన డెకాయిట్ రానున్నరోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి!
సినిమా కథ
తక్కువ కులానికి చెందిన హరి (అడివి శేష్)ని అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. కానీ, కులం కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఓ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన హరి తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను కేసులో ఇరికించిన సరస్వతిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో హరి, సరస్వతికి డబ్బు సమస్య వస్తుంది. మరి హరి.. సరస్వతిపై పగ తీర్చుకున్నాడా? డబ్బు కోసం ఇద్దరు కలిసి ఏం చేశారు? అతడు సరస్వతి అతడిని జైలుకు ఎందుకు పంపించింది? అన్నది డెకాయిట్ చూసి తెలుసుకోవాల్సిందే!
#Dacoit opens with a BANG ❤️🔥❤️🔥
15 CRORES+ GROSS ON DAY 1 🔥
The Biggest opening ever for @AdiviSesh 💥💥💥
Don’t miss it in theatres near you 🤩
Book your tickets now!
🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/3WON13una1— Annapurna Studios (@AnnapurnaStdios) April 11, 2026
చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ
Tags : 1