Breaking News

ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published on Sun, 05/03/2026 - 13:28

అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ‍అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ‍అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.

డకాయిట్ కథేంటంటే..

తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.

 

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)