ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
కాలితో తన్నా.. నావల్ల అనుష్క నొప్పితో బాధపడింది!
Published on Sat, 04/04/2026 - 11:35
ఏదో హడావుడిగా కాకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అడివి శేష్. ఈయన కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం హిట్:ద సెకండ్ కేస్. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత అతడు డెకాయిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
బాహుబలి జ్ఞాపకాలు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమాలో అనుష్కను హీనంగా చూసే ఓ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి వ్యక్తి. స్వీటీ.. ఆ పేరులోనే తెలిసిపోతోంది. ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే నీకు ఏం తగల్లేదు కదా? అని అడిగాను.
బలంగా తన్నడంతో..
ఎందుకంటే అప్పటికే నావల్ల ఒకసారి తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే తన్నాను. కానీ రాజమౌళి సర్ అది సరిపోదన్నాడు. దాంతో నేను బలంగా తన్నాల్సి వచ్చింది. దానివల్ల ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడే తొలిసారి తనతో మాట్లాడాను అని అడివి శేష్ తెలిపాడు. కాగా బాహుబలి మొదటి భాగంలో భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) కొడుకు భద్రుడిగా శేష్ నటించాడు.
చదవండి: ధురంధర్‌లో విలన్ రోల్.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
Tags : 1