Breaking News

ఓటీటీకి లియో.. రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఓ ట్విస్ట్!

Published on Fri, 11/17/2023 - 12:51

హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెలలోనే ఓటీటీకి రానుంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.  ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్‌హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ  యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో సినిమాలో హాలీవుడ్ నటుడు సెప్టాజినేరియన్ బల్లి పాత్రకు వాయిస్‌ అందించారు.   ఆడమ్ శాండ్లర్ కథను అందించారు.  మిగిలిన పాత్రలకు పలువురు హాలీవుడ్ నటులు వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. 

(ఇది చదవండి: నాగచైతన్య తొలి సిరీస్‌ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్‌)

అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ రావడంతో ఇండియాలో ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకుంటున్నారు. వాస్తవానికి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్‌ ఇంకా వెల్లడించలేదు. మొదట  ఈనెల 16న ఓటీటీకి రావొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన లిస్ట్‌లో 21న లియో మూవీ ఉండడంతో అందరూ విజయ్ సినిమానేని భావిస్తున్నారు. కానీ అదే పేరుతో తెరకెక్కించిన హాలీవుడ్ యానిమేషన్  మూవీ లియో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)