Breaking News

ఆరోజు హోటల్‌లో కావాలని ఇరికించారు.. ఇప్పటికీ వేధిస్తున్నారు : యమున

Published on Sat, 03/11/2023 - 16:38

వెండితెరపై హీరోయిన్‌గా అలరించిన నటి యమున ఆ తర్వాత సీరియల్స్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం, అభినయంతో చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్‌ పీక్స్‌ స్టేజ్‌లో ఉండగానే ఓ చేదు సంఘటన ఆమెకు ఎదురైంది.  2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసింది. దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.

ఆ తర్వాత ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలనే తనని ఇరికించారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఇప్పటికీ తనను వేధిస్తున్నారని, ఆ సంఘటనకు సంబంధించి అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆవేదనను వెల్లడించింది. ''ఆ సంఘటన తాలూకూ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది.

ఆరోజు అసలేం ఏం జరిగిందన్నది ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది.కానీ సోషల్‌మీడియాను మాత్రం కంట్రోల్‌ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్‌ననైల్స్‌తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్‌ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది'' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)