పెద్ది 'రామ్‌ చరణ్‌' తల్లిగా సీనియర్‌ నటి

Published on Tue, 09/16/2025 - 08:40

రామ్‌ చరణ్‌ పెద్ది  సినిమా షూటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్‌ చరణ్‌ తల్లి పాత్రలో సీనియర్‌ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్‌ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

పెద్దిలో పవర్‌ఫుల్‌ పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. అంతే రేంజ్‌లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్‌ నటి విజి చంద్రశేఖర్‌ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి  గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్‌ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్‌ నటి సరితకు విజి చంద్రశేఖర్‌ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్‌గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్‌ చరణ్‌కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్‌ నటిస్తుందని టాక్‌ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్‌ కూడా కామెంట్లు చేస్తున్నారు.

పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పిస్తున్నాయి. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)