Breaking News

గ్లామరస్‌గా ఉంటే క్యారెక్టర్‌నే తప్పుపడతారా?: హీరోయిన్‌ ఫైర్‌

Published on Sun, 09/21/2025 - 09:05

కొందరు నటీమణులను చూస్తే వీరికి వయసు పెరగదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో వేదిక (Actress Vedhika) ఒకరు. ఈ మహారాష్ట్ర బ్యూటీ వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ కోసం కష్టపడుతూనే ఉంది. 

హీరోయిన్స్‌ అంటే చాలు..
తమిళంలో ముని, సక్కరకట్టి, కాళై, పరదేశీ, కావియ తలైవన్, కాంచన–3 వంటి చిత్రాల్లో నటించిన వేదిక ఇప్పటికీ తన సొగసులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని విమర్శలు ఈ బ్యూటీకి కోపం తెప్పించాయి. గ్లామరస్‌గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారని ఆగ్రహించింది. సాధారణంగానే హీరోయిన్లు అంటే విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం రెడీగా ఉంటుందని, అందులోనూ కాస్త గ్లామరస్‌ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్‌నే తప్పుపడుతున్నారని మండిపడింది.

నేను లెక్క చేయను
దుస్తుల గురించి విమర్శించే దుస్థితి మారాలంది. తానూ బికినీ ధరించి కూడా నటిస్తానని, ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పింది. తానేమిటో తనకు బాగా తెలుసని, తప్పుడు బుద్ధి కలవారు మారితే మంచిదని వేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది.

చదవండి: ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్‌ హిట్‌ జంటపై డేటింగ్‌ రూమర్స్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)