Breaking News

క్యాన్సర్‌తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!

Published on Fri, 12/12/2025 - 14:25

టాలీవుడ్‌లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్‌ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్‌, ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

కరాటే కల్యాణి ఎమోషనల్‌ పోస్ట్‌
ఆర్టిస్ట్‌ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్‌ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్‌ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తోంది పద్మక్క అలియాస్‌ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్‌లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్‌ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..

దయచేసి కాపాడండి
కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్‌ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ఎవరీ వాహిని?
వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్‌ అయింది. చివరగా పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.

చదవండి: భరణి అవుట్‌.. సెకండ్‌ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)