కమెడియన్‌ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు

Published on Mon, 06/01/2026 - 13:14

దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్‌ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్‌ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.

ఆయనలా నటించా..
ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్‌ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.

చదువు లేదు
అందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్‌ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్‌ నేర్చుకుందామని క్లాసెస్‌కు వెళ్లాను. అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్‌ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. 

అప్పుడే డిసైడయ్యా..
ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్‌ చేశావ్‌ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.

చదవండి: డోలారే సాంగ్‌ షూటింగ్‌లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్‌?

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)