Breaking News

రిటైర్మెంట్ ప్రకటించిన టాలీవుడ్ 'అమ్మ'

Published on Tue, 11/18/2025 - 17:22

ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు.. తాము తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటామని చెబుతుంటారు. కానీ అవకాశాలు వస్తున్నా సరే వద్దని చెప్పి రిటైర్మెంట్ తీసుకునేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు సీనియర్ నటి తులసి అలాంటి షాకింగ్ ప్రకటన చేశారు. ఈ డిసెంబరు 31 తర్వాత తాను ఇకపై నటించనని అన్నారు. తర్వాత తన జీవితం సాయిబాబాకు అంకితం చేసేశానని ప్రకటించారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

తులసి.. మూడు నెలల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చేశారు. తులసి తల్లి అలనాటి సావిత్రి స్నేహితురాలు. దీంతో 'జీవన తరంగాలు' అనే సినిమాలో ఊయలలో ఉండే పాపాయి పాత్ర కోసం తులసి తల్లిని అడిగారు. అలా తులసి.. తాను పుట్టిన 1967లో సినీ రంగ ప్రవేశం చేశారు.

(ఇదీ చదవండి: భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి)

నాలుగేళ్లు వచ్చిన తర్వాత నుంచి బాలనటిగా వరస సినిమాలు చేశారు. అలా తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో నటించింది. కన్నడ దర్శకుడు శివమణిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రలతో ఫేమ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోనూ ప్రభాస్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లకు తల్లిగా నటించారు.

గత కొన్నాళ్ల నుంచి చాలా పరిమితంగా మూవీస్ చేస్తున్న తులసి.. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న సాయిబాబా దర్శనానికి వెళుతున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. తర్వాత సాయిబాబాకు సేవ చేసుకుంటూ బతికేస్తానని అన్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ నటి హేమ ఇంట్లో విషాదం)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)