Breaking News

విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!

Published on Mon, 05/04/2026 - 15:09

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్‌ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్‌ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్‌పై రూమర్స్‌ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. 

 

 

Videos

దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK

LIVE : విజయ్ గెలుపు జగన్ రియాక్షన్

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)