Breaking News

ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?

Published on Sat, 03/29/2025 - 21:27

త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్‌ హీరోయిన్‌. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్‌ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ‍ప్రస్తుతం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, థగ్‌ లైఫ్‌, విశ్వంభర, రామ్‌.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.

ప్రేమదే విజయం
తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్‌ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్‌ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్‌ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.

పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌?
తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్‌, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది.

 

 

చదవండి: చరణ్‌ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)