Breaking News

ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. అక్కినేని కోడలి రివ్యూ

Published on Tue, 11/11/2025 - 15:55

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చిత్రాలు విభిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటాయి. అలా థియేటర్లలోకి రాకముందే పలు వివాదాలు ఎదుర్కొని ఆపై ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చిన ఓ తమిళ డబ్బింగ్ మూవీని అక్కినేని కోడలు చూసింది. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చేసింది. అమ్మాయిలు కచ్చితంగా చూడాలని చెప్పి రికమెండ్ కూడా చేసింది.

'బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది, ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ చూడాల్సిన చిత్రం. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్నికచ్చితంగా చూడమని చెబుతున్నాను. ఇది మనకోసం.. వర్ష భరత్, అంజలి శివరామన్‪‌ని అభినందించాలి' అని శోభిత తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన 'బ్యాడ్ గర్ల్'.. ఓటీటీ రివ్యూ)

'బ్యాడ్ గర్ల్' సినిమా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో తీసిన బోల్డ్ సినిమా. వెట్రిమారన్ దగ్గర సహాయకురాలిగా పనిచేసిన వర్ష భరత్ అనే అమ్మాయి.. దర్శకురాలిగా తీసిన తొలి మూవీ ఇది. వెట్రిమారన్‌తో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దీన్ని నిర్మించారు. థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. గతవారం హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి ఉంది.

'బ్యాడ్ గర్ల్' విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). ఓ బాయ్ ఫ్రెండ్, చిన్న ఇల్లు ఉంటే చాలని అనుకుంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్‌లో ఉంటుంది. వీటిలో ఏ బంధమూ ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్' కోసం వస్తున్న బాయ్ ఫ్రెండ్.. రష్మిక కోసం విజయ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)